Friday, March 4, 2022

చక్రార్చన

  చక్రార్చన




పరమేశ్వరి యొక్క యంత్రరూపాన్నే శ్రీచక్రము అంటారు. ఇందులో మొత్తం తొమ్మిది ఆవరణలుంటాయి. ఆ ఆవరణలలో వివిధ దేవతలు ఉంటారు. వీరందరినీ తొమ్మిది ఆవరణలలోనూ విడివిడిగా అర్చించటాన్నే శ్రీచక్రపూజ, నవావరణార్చన లేదా చక్రార్చన

అంటారు. శ్రీచక్రం మూడు ప్రస్తారాలుగా ఉంటుంది. అవి

1. భూప్రసారము

2. మేరు ప్రసారము

3. కైలాస ప్రసారము

అలాగే శ్రీచక్రపూజ కూడా మూడురకాలు అవి.

1. సృష్టి పూజ 2. స్థితిపూజ 3. సంహారపూజ. వీటిలో

మేరు చక్రం మీద - సృష్టి క్రమంలోను

కైలాసము, అర్ధమేరువుల మీద  - సంహారక్రమము

భూప్రస్థారం మీద - స్థితిక్రమము 

లో ఈ అర్చన చెయ్యాలి. అయితే ఈ అర్చనావిధానంలో

1. సృష్టి క్రమము బిందువు దగ్గర మొదలు పెట్టి భూపురం దాకా అన్ని ఆవరణలను అర్చించటం.

2. సంహారక్రమము భూపురం దగ్గర మొదలు పెట్టి బిందువుదాకా ఆవరణ దేవతలను అర్చించటం.

3. స్థితి క్రమము అంతర్దశారం దగ్గర మొదలు పెట్టి భూపురం దాకా, ఆ తరువాత అష్టకోణం దగ్గర నుండి బిందువు దాకా ఆవరణ దేవతలను అర్చించాలి.

చక్రార్చన ఎప్పుడూ సంహారాంతంగానే ఉండాలి. ప్రతి ఆవరణలోను ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి. చక్రార్చనలో పాత్రాసాధన అనేది సంప్రదాయాన్ని బట్టి

వేరువేరుగా ఉంటుంది. కాబట్టి దాన్ని గురు సంప్రదాయం ప్రకారమే చెయ్యాలి.

శ్రీ చక్రాధి దేవత అయిన పరమేశ్వరి సృష్టికి ముందునుంచీ ఉన్నది. మేరుపర్వత శిఖరాన త్రిపురముల యందు ఉంటుంది. ఆమె పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి జ్ఞానమయి. జ్ఞానముచేతనే ఆమెను తెలుసుకోవాలి. గుణాతీతురాలు. మహాత్రికోణమందుంటుంది.

ఆమె నిష్కళంక. ఆమె చరిత్ర మహాద్భుతము. తన భక్తుల కోరికలను తీరుస్తుంది. ఆమెను పునశ్చరణ ద్వారానే పొందాలి. ఆమె తత్త్వాతీత. షడధ్వాతీత.

కరుణాసముద్రురాలు. పాపాత్ములు పుణ్యాత్ములు అనే భేదం లేకుండా అందరి మీదా ఒకే రకమైన కరుణ

చూపుతుంది. భక్తుల యొక్క అజ్ఞానపు చీకట్లను పారద్రోలి జ్ఞానజ్యోతులు వెలిగిస్తుంది. ఆ బాలగోపాలము ఆమెను ఎరుగుదురు. ఆ పరమేశ్వరి శాసనాలు మీరటానికి లేదు. ఇటువంటి పరమేశ్వరి ఎక్కడ ఉంటుంది. అంటే శ్రీచక్రరాజమందు ఉంటుంది.

ఆమె త్రిపురసుందరి. శివునితో తాదాత్మ్యం చెందిన లలితాంబిక. పరమేశ్వరి శ్రీచక్రంలో ఉంటుంది. కాబట్టి శ్రీవిద్యలో చక్రార్చన చాలా ముఖ్యమైనది.

ఆశానాం పూరకం చక్రం అర్చకానాం అహర్నిశం

తనను అర్చించే భక్తుల కోరిక ఇహముగాని పరముగాని తప్పక తీరుస్తుంది.

974. బిందుతర్పణసంతుష్టా

🌷🌷🌷🌷🌷🌷🌷🌷

శ్రీచక్రంలో తొమ్మిదవ ఆవరణ సర్వానందమయ చక్రము. అక్కడ ఉండేది బిందువు. అదే నిరాకారుడు నిర్గుణస్వరూపుడు అయిన పరబ్రహ్మ. నాలుగు వర్ణములవారు తర్పణ చెయ్యటంచేత తృప్తి చెందుతుంది కాబట్టి బిందుతర్పణసంతుష్టా అనబడుతుంది.

బ్రాహ్మణులు - క్షీరముతోనూ

క్షత్రియులు - ఆజ్యముతోనూ

వైశ్యులు - తేనెతోనూ

శూద్రులు - నీటితోనూ

బిందువునందు పరమేశ్వరికి తర్పణ చెయ్యాలి అని తంత్ర శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రీచక్రంలో బిందువు ముఖ్యమైనది. అది శివశక్తుల సంగమస్థానం. కాబట్టి అర్చనా కాలంలో పరమేశ్వరికి బిందువునందే తర్పణ చెయ్యాలి. ఆ తర్పణ దేవిని సంతృప్తి పరుస్తుంది. అందుచేతనే దేవి బిందుతర్పణసంతుష్టా అనబడుతుంది

974. 🔱🙏 బిందుతర్పణ సంతుష్టా  🙏🔱

ఎనిమిది అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు *బిందుతర్పణ సంతుష్టాయై నమః* అని చెప్పాలి

బిందు = శ్రీచక్రము నందలి బిందువు నందు, 

తర్పణ = తర్పణము చేయుటచే, 

సంతుష్టా = తృప్తి నొందునది.

శ్రీ చక్రంలోని నవావరణమే బిందువు. ఈ బిందువు శ్రీ చక్రానికి కేంద్రము. ఒక విధముగా చెప్పుకోవాలంటే ఇరుసు(Axis) లాంటిది. చక్రభ్రమణంలో ఉన్న దేనికైనా ఒక అక్షం ఉంటుంది. భ్రమణం చేసే వస్తువులో ఏ భాగమైతే కదలకుండా మిగతా భాగమంతా తిరగడానికి ఆధారం అవుతుందో - దాన్ని 'అక్షము' అంటారు. అంటే కదిలే దాంట్లో కదలకుండా ఉండేదే ' అక్షం' అన్నమాట ! కాలచక్రంలో విశ్వభ్రమణ కారకమైన అమ్మవారు కూడా తను మాత్రం నిలకడగా మార్పు లేకుండా ప్రశాంతంగా ఉంటూ - అన్నిటినీ చరింపచేస్తుంది. శ్రీ చక్రంలోని బిందుస్థానమే అయ్యవారితో కలసి ఉండే అమ్మవారి నిలకడ స్థానాన్ని సూచిస్తుంది. ఈ బిందు స్థానం వద్ద తర్పణాలు, హవిస్సులు సమర్పిస్తే ఉత్సవ విగ్రహం దగ్గర కాకుండా ప్రశాంతంగా, స్థిరంగా, మార్పులే కుండా ఉండే మూలవిరాట్ విగ్రహం దగ్గర సమర్పించిన విధంగా ఉంటుందనే భావన కలగాలి. అందుకే బిందువు వద్ద అర్పణ చేసిన తర్పణాలంటే అమ్మవారు సంతుష్టి  చెందేది.

మనలో బ్రహ్మరంధ్ర స్థానం వద్ద ఉండే సహస్రారంలోని చంద్రమండలం వద్ద ఉన్న స్థానాన్నే 'బిందువు' అంటారు. మనకు మెలకువ వచ్చినపుడు ఎక్కడ దానికి ప్రారంభమో - దాన్ని 'బిందువు' అంటారు. మెలకువ రావడం అంటే 'నేను' అన్న పదానికి అర్థం తెలియడమే ! ఏదైనా విషయం అర్ధమవడమంటే - చిచ్ఛక్తి పనిచెయ్యడం ప్రారంభమవడమే ! చిచ్చక్తి కి పాదుకలుగా 'విమర్శ' 'ప్రకాశ' బిందువులను సమన్వయపరచుకోవచ్చును. కాబట్టి - ఈ బిందువుల వద్ద తర్పణాలు, హవిస్సులు సమర్పిస్తే చిచ్చక్తికి పాద పూజ జరిగినట్లే! పాదుకాంత దీక్ష ఫలించినట్లే ! అయితే ఇలా చేయగలగడం, ఈ స్థితికి రావడం కుండలినీయోగంలో ఎంతో సాధన ఉన్నవారికే సిద్ధిస్తుంది. అందుచేతనే ప్రస్తుత నామం - స్తోత్రంలో చివరకు చెప్పబడుతుంది. సాకారమైన జగత్తుకు సంకల్పమే ఈ బిందువు అని కూడా అర్థం చేసుకోవాలి. అంతేకాదు - మనలో ఏదైనా అందాము అనిపించే నాదమూలస్థితి - ఈ బిందువే! మన వాక్కు మనలో ఇమిడి ఉన్న చోటు - ఈ బిందువే ! తైత్తి రీయంలో చెప్పబడిన * సేంద్రయోనిః'*అనే మంత్రంలోని 'యోని' - ఈ బిందువే !

సౌందర్యలహరిలో ఆదిశంకరులు వ్రాసిన 'సుధాసింధోర్మధ్యే... శ్లోకంలోని సుధాసింధువు - ఈ బిందువే!

బ్రహ్మాండ పిండాండాలకు శ్రుతి (Tuning) కుదరాల్సింది ఈ బిందువు వద్దనే | మనస్సు ఆత్మలో లీనమయే చోటు ఈ బిందువే ! దీన్నే జ్యోతిశ్శాస్త్రంలో రవి, చంద్రుల సమాగమస్థితిగా చెబుతారు. (జీవుల యందు సూర్యకళ వర్తించదు. చంద్రకళే వర్తిస్తుంది. అందుకనే మనకు కళలు (Moods) ఎక్కువ.

రవిచంద్రుల సమాగమస్థితి అనే అమావాస్య నుండి పాడ్యమిని కనుగొనటమే బిందువికసన ప్రారంభం. ఎందుకంటే - అమావాస్య అనేది మనకు - దేవతలకు మధ్య వర్తించే ద్వారం లాంటిది కాబట్టి. తెలుసుకునేవాడు తెలియ వలసిన దాంట్లోకి లీనమయేది ఈ బిందువు వద్దనే ! 

1) శ్రీ చక్రంలోని బిందువు నందు తర్పణ చేయుటచే సంతుష్టి నొందునది.

2) సహస్రారంలోని చంద్రమండల స్థానం వద్ద తర్పణ చేయుటచే సంతుష్టి నొందునది.

3) సాకారమైన జగత్తుకు సంకల్ప బిందువు వద్ద జరుగు తర్పణ, హవిస్సులకు సంతుష్టి చెందునది - అని ఈ నామానికి అర్థాలు చెప్పవచ్చును.

975. 🔱🙏 పూర్వజా  🙏🔱

మూడు అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు *పూర్వజాయై నమః* అని చెప్పాలి.

పూర్వజా = అన్నిటి కన్నా ముందు ఉండునది.

ఇంతకు ముందు నామంలో బిందువు గురించి చెప్పబడింది. ఆ బిందువు కంటె ముందు ఉండేది అమ్మవారు - అని ఈ ప్రస్తుత నామం సూచిస్తుంది. పెట్టబోయే 'చుక్కలాగ, కాబోయే 'వాక్యం' లాగా ఉండే అమ్మవారి నామాన్ని పూర్వజా' అంటారు. తైత్తిరీయంలో కూడా “అహమస్మి ప్రథమజాఋతాస్య, పూర్వం దేవేభ్యో అమృతస్య నా

భాయి, యో మాదదాతి స ఇదేవమావా:” అని చెప్పబడింది.

“ అడిగినప్పుడల్లా అమ్మవారు ఉందన్నారు - బాగానే ఉంది. అడిగేవారు లేక ముందు కూడా ఉందా ?” అని ఎవరైనా ప్రశ్నవేస్తే - 'ఉంది' అనేదే సమాధానం. అయితే - ఎలా ఉంది? అని మళ్ళీ ప్రశ్నిస్తే ఎవరికి' ? అని అనాల్సి వస్తుంది. అప్పుడు ప్రశ్నవేసిన వాడు అయోమయంలో పడాల్సి వస్తుంది. కాబట్టి 'పూర్వజా' అని పిలువబడే సృష్టికర్తి అయిన అమ్మవారి విషయంలో అలా ప్రశ్నించడం అర్థం లేదని తెలుసుకోవాలి.

శ్రీ మద్భాగవతంలో శ్రీకృష్ణుని కన్నా ముందు పుట్టినట్లుగా చెప్పబడిన 'యోగమాయ' - ఈ 'పూర్వజా' నామాన్ని సూచిస్తుందని కూడా చెప్పుకోవచ్చును.

నిద్రపోత్నునపుడు, మెలకువరాక పూర్వం కూడా మనలో ఉన్న అమ్మవారి నామం 'పూర్వజా' అని చెప్పుకోవచ్చును.

విష్ణు పురాణంలో - మహా విష్ణువు, శివ పురాణంలో - సదాశివుడు, దేవీ భాగవతంలో - అమ్మవారు, వేదాంతంలో పరబ్రహ్మ - వీళ్ళు ఉండటమే గాని పుట్టడం' ఉండదు. వీళ్ళే ' పూర్వజులు' అన్న మాటకు అర్హులు. వీళ్ళ కంటే ముందు పుట్టిన వారుండరు. ఉన్న వారే ఉంటారు.

1) బిందువు కన్న ముందు ఉన్నది. 

2) కాబోయే వ్యక్తమును సూచించు అమ్మవారి నామము. 

3) భాగవతంలో శ్రీ కృష్ణుని ముందుగా పుట్టినట్లు చెప్పబడిన యోగమాయ.

4) నిద్ర పోతున్నపుడు, మెలకువరాక పూర్వము గూడా మనలో ఉండునది -- అని ఈ నామానికి అర్ధాలు చెప్పవచ్చును.

976. 🔱🙏 త్రిపురాంబికా  🙏🔱

ఐదక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు *త్రిపురాంబికాయై నమః* అని చెప్పాలి.

త్రివుర = త్రిపురములచే సూచింపబడు వానికి, 

అంబికా = మూలమైన తల్లివంటిది.

త్రిపురాలుగా సూచింపబడేవి చాలా ఉన్నాయి. ముఖ్యంగా మనలోని స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలను త్రిపురాలంటారు. చిత్ బిందువు, ప్రకాశ బిందువు, విమర్శ బిందువులుగా వికసనం చెందే మూడింటికి - ప్రథమ, మధ్యమ, ఉత్తమ పురుషులుగా ప్రతిపాదింపబడే మూడింటికి, - ఉచ్చారణ జరగడానికి కావలసిన ప్రయత్నంలో ప్రారంభ ప్రేరణ జరిగే - 1) నాభి 2) హృదయం 3) విశుద్ధి - ఈ మూడింటికి గూడా మూలకారణమైన మాతృస్థానంగా ఉండే అమ్మవారిని 'త్రిపురాంబికా' అంటారు. నాభి, హృదయం, విశుద్ధి - ఈ మూడు పురాల్లోను ఉండే - భైరవులకు అధిదేవత అయిన అమ్మవారిని ' త్రిపుర భైరవి' అంటారు. అలాగే - ఈ త్రిపురాల్లో సౌందర్యం స్థాపించబడితే ఆ సౌందర్య మూర్తె 'త్రిపుర సుందరి' అని పిలువబడుతుంది.

త్రిపురములుగా సూచింపబడు వాటికి మూలమైన తల్లివంటిది' అని ఈ నామానికి అర్ధం.

977. 🔱🙏 దశముద్రా సమారాధ్యా   🙏🔱

ఎనిమిది అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు *దశముద్రా సమారాధ్యాయై నమః* అని చెప్పాలి.

దశ = పది, 

ముద్రా = ముద్రలచేత, 

సమ్యక్ + ఆరాధ్యా - సమారాధ్యా = చక్కగా ఆరాధింపబడునది.

‘ముదం ద్రావయతీతి - ముద్రా' అంటారు. - అనుభూతి కలిగినపుడు అప్రయత్నంగా మనలో గలిగే ఒక భంగిమను 'ముద్ర' అంటారు. ఉదా: ఒక గౌరవనీయమైన వ్యక్తిని చూడంగానే అప్రయత్నంగా మన అరచేతులు రెండూ దగ్గరౌతాయి. అదే సమస్కార 'ముద్ర' (సంపుటీ ముద్ర). లోపల ఏ ముద్ర వస్తే మనం తెలియకుండానే ఆ ముద్ర పడతామో అది అసలైన ముద్ర. అమ్మవారు బయటకు సృష్టిగా రాబోయే ముందు అయ్యవారికి ఒక 'ముద్ర' వస్తుంది అప్రయత్నంగా - అది - ‘మహాముద్ర'. .

ఇంకా ఇలా -జ్ఞానముద్ర' (దీన్నే 'ఉపదేశముద్ర' 'చిన్ముద్ర' అని కూడా అంటారు) సంపుటీ ముద్ర అంజలి ఘటిస్తున్నట్లుండే ముద్ర ఇది). విరతముద్ర (పుస్తకం తెరచినట్లుండే ముద్ర). త్రిముఖము (దీన్నే యోనిముద్ర, త్రికోణముద్ర అంటారు. (రామకృష్ణ పరమహంస శరీరం వదులు తారనంగా క్రిందటి రోజున ఈ ముద్రతో వివేకానందునికి విశ్వరూప సందర్శనం గావించాడు). పంచముఖ ముద్ర (దూరంగా వెళ్తున్న అభయ ముద్ర) అధోముఖీ ముద్ర (దీన్నే స్వాగతము ద్ర, లేదా - ప్రభాత ముద్ర అని గూడా అంటారు). సన్ముఖముద్ర (ఎడమచేత వరద, కుడిచేత అభయముద్రలు కలసి ఉంటాయి. ప్రలంబిక ముద్ర (ఒక చేతికి ఒక చెయ్యి లంబంగా అంటే పైగా ఉంచితే ఏర్పడే ముద్ర) ముష్టిక, మత్స్య, కూర్మ, వరాహ, శకట, గ్రథిత, ఉన్ముఖ, విస్తృత, ద్విముఖ, చతుర్ముఖ, చివరకు మహాక్రాంతముద్ర (రామకృష్ణ పరమహంస చెయ్యి పైకెత్తిన ముద్ర) ఇలా ఎన్నో రకాల ముద్రలున్నాయి.

అయితే, శ్రీ విద్యకు సంబంధించిన ముద్రలు ప్రత్యేకంగా పది ఉన్నాయి. సర్వ సంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశంకరి, సర్వోన్మాదిని, సర్వమహాంకుశ, సర్వఖేచరి, సర్వబీజ, సర్వయోని, సర్వత్రిఖండా - ఈ ముద్రలు పదింటినీ - దశముద్రలంటారు. కుడిచేతి వ్రేళ్ళను శివతత్త్వంగా, ఎడమచేతి వేళ్ళను శక్తి తత్త్వంగా

మేళనంతో - శివశక్తి సామరస్య రహస్యార్థాలను, సృష్ట్యాది కృత్యాలపరంగా - ఎన్నిటినో ఇటువంటి ముద్రల రూపంలో అభినయంచవచ్చు. అమ్మవారి సాన్నిధ్యంలో ఇటువంటి ముద్రలను ప్రదర్శిస్తూ ఆరాధిస్తే అమ్మవారికి చాలా ఇష్టమౌతుందిట. అందుచేత అమ్మవారు - దశముద్రాసమారాధ్యా!!.

శ్రీవిద్యకు సంబంధించిన ప్రధానమైన దశముద్రలచే చక్కగా ఆరాధింపబడునది - అని ఈ నామానికి అర్థం.

978.🔱🙏 త్రిపురాశ్రీవశంకరీ   🙏🔱

ఎనిమిది అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు - *త్రిపురా శ్రీవశంకర్యై నమః* అని చెప్పాలి.

శ్రీ చక్రంలోని ఐదవ చక్రాన్ని అధిష్ఠించి ఉండే ' త్రిపురాశ్రీ' అనే దేవత ప్రసన్నమయేట్లు చేయగలది కాబట్టి, అమ్మవారు - త్రిపురా శ్రీవశంకరీ.

'త్రిపురాశ్రీ' అను దేవతను ప్రసన్నురాలుగా చేయునది - అని ఈ నామానికి అర్థం .

979. 🔱🙏 జ్ఞానముద్రా  🙏🔱

నాలుగు అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు - *జ్ఞానముద్రాయై నమః*  అని చెప్పాలి.

జ్ఞానముద్రా = జ్ఞానము ద్రా స్వరూపిణి.

ఇంతకు పూర్వమే ముద్రలకు సంబంధించిన నామంగా 'దశముద్రా సమారాధ్యా" అని ఒక నామం చెప్పబడింది. ఆ నామంలో చెప్పబడిన ముద్రలు ప్రత్యేకంగా శ్రీ విద్యకు సంబంధించిన ముద్రలు. ఇప్పుడు మళ్ళీ అమ్మవారికి 'జ్ఞానముద్రా' అనే నామం కూడా చెప్పబడిందంటే - అన్ని ముద్రలలోకి ప్రత్యేకమైనది, విశిష్టమైనది ఈ ముద్ర అని వేరే చెప్పాల్సిన పనిలేదు.

ఈ జ్ఞానముద్ర' నే 'చిన్ముద్ర' అని కూడా అంటారు. దక్షిణామూర్తి యువకరూపంలో కుడి అరచేతి వ్రేళ్ళతో ఈ ముద్రను ధరించి మౌనంగా ఉంటాడు. 'ఎదురుగా వృద్ధుల రూపంలో ఉన్న శిష్యులందరికీ ఈ చిన్ముద్రను చూస్తుండగానే వారి సందేహాలన్నీ పటాపంచలై,

జ్ఞానవంతులౌతారు' అని ఈ క్రింది శ్లోకం చెబుతుంది.

*శ్లో. చిత్రం వటత రోర్మూలే శిష్యా వృద్ధాః గురోర్యువా*

*గురోస్తు మౌనవ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయా* 

కుడి చేతి చూపుడు వ్రేలు కొసను బొటన వ్రేలి కొసకు తగిలించి, మిగిలిన మూడు " వ్రేళ్ళను నిట్టనిలువుగా పైకి (అభయ ముద్రలోలాగా) ఉంచినప్పుడు ఏర్పడే ముద్రను * చిన్ముద్ర' అంటారు. దీన్నే 'జ్ఞానముద్ర' అని కూడా అంటారు. ఈ ముద్రను తిలకిస్తున్నపుడు సందేహాలు నివృత్తి జరిగి, సర్వజ్ఞానం ద్యోతకమౌతుంది. అంతటి ప్రాముఖ్యం గల ముద్రకాబట్టి ప్రత్యేకంగా జ్ఞాన స్వరూపిణి అయి అమ్మవారు ఈ - జ్ఞానముద్రా' స్వరూపిణిగా చెప్పబడింది. దేన్నైనా చూసినపుడు 'చాలా బాగుంది” లేదా 'చాలా బాగుంటుంద' ని చెప్పవలసి వచ్చినపుడు - నోటితో చెప్పకుండానే ఈ ముద్రను అభినయించటం గూడా మనం చూస్తూ ఉంటాం.

ఈ ముద్రలో ఒక “పూర్ణత్వం ' సూచన ఉంది. చూపుడు వ్రేలు బొటన వ్రేలు కొసలు కలిసినపుడు అవి రెండూ ఒక వృత్తాకారాన్ని ఏర్పరుస్తాయి. ఈ ఆకారం 'పూర్ణత్వా నికి, పూర్ణానుస్వారానికి సంకేతం.

ఈ ముద్రలో బొటన వ్రేలు జీవుణ్ణి, చూపుడు వ్రేలు బ్రహ్మను సూచిస్తాయి కాబట్టి- ఆ రెంటి కలయిక 'జీవేశ్వర సర్వేశ్వర ఐక్యాన్ని - 'అద్వైతస్థితి' ని 'కైవల్యాన్ని' సూచిస్తుంది. కాబట్టి, దీన్ని మించిన ముద్రలేదు. అందుకే అమ్మవారికి ఈ ముద్ర అత్యంత ప్రీతి పాత్రము.

జ్ఞానము ద్రా స్వరూపిణి - అని ఈ నామానికి అర్థం.

(సేకరణ)(ఆదిత్యనారాయణ)(తిప్పానా)

గురువుగుకారశ్చంధకారశ్చ రుకారస్తన్నిరోధకృత్ (గురు గీత)

 గురువుగుకారశ్చంధకారశ్చ రుకారస్తన్నిరోధకృత్ (గురు గీత)






గు - అంధకారం

రు - దాన్ని నిరోధించగలిగినవారు, నివారణ చేయగలిగినవారు

అంధకార నివారణ, అనగా అజ్ఞాన నివారణ చేయగలిగేవారు గురువులు

చిన్నప్పుడు వచ్చీరాని మాటలు మాట్లాడినా, దాన్ని అక్షర రూపంలో వ్రాయడం నేర్పినవారు, అక్షర విషయకమైన అజ్ఞానాన్ని తొలగించిన వారు అక్షర గురువులు. అదేవిధంగా భాషా విషయమై అంధకారాన్ని, అజ్ఞానాన్ని తొలగించి, పదాల కూర్పు, వాక్యాలు, వ్యాసాలు మొదలైనవీ, భాషకు సంబంధించిన నియమాలు, వ్యాకరణం నేర్పినవారు, భాషావిషయకమైన అజ్ఞానాన్ని, అంధకారాన్ని పోగొట్టినవారు భాషా గురువు. ఇదే విధంగా, మనకు సైన్సు, లెక్కలు, భూగోళ, ఖగోళ ఇత్యాది విషయాల్లో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి వాటిని నేర్పేవారు ఆయా విషయ గురువులను తెలియబడుతున్నారు.

ఉపనయనం, బ్రహ్మోపదేశం అయ్యిన తరవాత, మనకు వేదం తెలిసినవారు, ఎవరైతే వేదం తెలియనివానికి వేదం నేర్పిస్తున్నారో, అతను వేదగురువు ఔతున్నాడు. అలాగే ఆయా శాస్త్ర గురువులు ఇత్యాది. ఇలా వీరిదగ్గర బాగా నేర్చుకున్న వ్యక్తి మరొకరికి ఆయా విషయాల పట్ల ఉన్న అజ్ఞానాన్ని, అంధకారాన్ని పోగొడతాడు. అతను పరంపరలో ఇంకొక గురువుగా వస్తున్నాడు. మనకు తేలికగా అవగతమవడానికి, సామాన్య పరిభాషలో ఇదీ గురువుకు సంబంధించిన విషయం.

జగత్తు

మనకి జగత్తు రెండు విధాలను చెప్పబడింది

1) స్వాప్నిక జగత్తు - అవాస్తవమైనది. కలలో మాత్రమే కనిపించేది.

2) జాగ్రత్ జగత్తు - ఇది మన కంటికి కనపడేది ఇంద్రియాలతో తెలుస్తున్నది, మన మనసుకి అనుభవంలోకి వస్తున్నది.

మనమందరం ఈ జాగ్రత్ జగత్తులోని విషయాలని కళ్లతో చూస్తున్నాం, స్పర్శతో తెలుసుకుంటున్నాం మిగతా ఇంద్రియాలతో అనుభవిస్తున్నాం. మన మనసుకు కలిగిన అనుభవానికి విరుద్ధంగా ఇంకొకరు చెప్తే ఔనా అలాగా అని నమ్మడానికి లేదు. కానీ శాస్త్రం ఈ జాగ్రత్ జగత్తును కూడా అవాస్తవ జగత్తు అనే అంటుంది. దీనివల్ల మనకి సందేహం కలుగుతుంది. ఈ విషయాలను తెలుసుకోవడానికి మనకు తెలియపరచడానికి మనమొక గురువు దగ్గరకెళ్లాలి.

జగత్తులో కలుగుతున్న అనుభవానికి సంబంధించి సత్య విషయం, జగత్స్వభావం తెలుసుకోవడం, తత్సంబంధ అంధకారం తొలగించుకోవడానికిగానూ గురువును ఆశ్రయించాలి.

"జగత్తులో ఉన్న ఒకే విషయంపట్ల మనకు ఒక్కొక్కరికీ ఒక్కొక్క అనుభవం కలగవచ్చు. భిన్న-భిన్నమైన అనుభవాలు కలుగవచ్చు. ఉదా:- పౌర్ణమి చంద్రుడున్నాడు, అందరికీ జానెడే కనిపిస్తాడు, గుండ్రని అప్పడంలా కనిపిస్తాడు. మనకు కొద్ది దూరంలోనే ఉన్నట్లు కనిపిస్తాడు. అంతమాత్రాన నిజానికి చంద్రుడు అప్పడంరూపంలోనో, జానెడు పరిథిలోనో, మనకు కొద్ది దూరంలోనే ఉంటాడా? లేదు, చాలా పెద్దగా ఉంటాడు, లక్షల కి.మీ. దూరంగా ఉంటాడు.

భూమి మీదనుంచి ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని చూసే వ్యక్తికి అది ఓ చిన్న పక్షిరూపంలో కనిపిస్తుంది, దానియొక్క అసలు పరిమాణం మరుగునపడుతుంది. అదే ఆకాశంలో విమానంలో ఉన్న విమానంలోంచి క్రిందకు చూస్తున్న ప్రయాణీకునికి క్రింద ఉన్న ఇళ్ళు, మనుషులు చీమలు, క్రిముల పరిమాణంలో కనపడతాయి. నిజాకవేవీ సత్యం కాదు. విమానం చాలా పెద్దది, భూమి మీద ఉన్న మనుష్యులు, ఇళ్ళు-భవనాలపరిమాణం చీమలంత క్రిములంత కాదు.

దీనివల్ల మనకు తెలిసేదేమిటంటే మనకు కలిగిన అటువంటి అనుభవాలన్నీ దుష్టమైనవే కానీ, నిర్దుష్టమైనవి కావు కదా.

ఆవిధంగా దుష్టమైన అనుభావలన్నీ సత్యం కావు అని తెలిసి జగత్తు యొక్క స్వభావం, తత్త్వం వాస్తవ స్వరూపం గురించి పూర్తిగా తెలిసినవాడు జగత్తుగురించి తెలుపగలడు మనకు నిర్దుష్టంగా.

మనకు ఒక నానుడి ఉన్నది "జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేలా?" అని. జగములో ఉన్నవారంతా గుర్తుపట్టే బ్రాహ్మణునికి అని కాదు ఇక్కడ చెప్పింది, జగమంటే ఏమిటో దాని స్వభావమేమిటో పూర్తిగా తెలిసినవానికి జంధ్యం అవసరంలేదు అని. జంధ్యం అవసరంలేని బ్రాహ్మణుడెవరు అనే ప్రశ్నకు సమాధానం "సన్యాసి" అని. జగత్తుగురించి పూర్తిగా తెలియని వాడు జంధ్యం వేసుకుని సాధన చెస్తారు. కొందరు సన్యాసులైనా సరే, ఎందుకంటే వారికి జగత్స్వరూప స్వభావాలు సరిగ్గా పూర్తిగా తెలియవు కాబట్టి. నిర్దుష్టం, నిర్దోషం కాని జగత్తునందలి అనుభవాలను కూడా సత్యమే, వాస్తవమే అనుకునే సిద్ధాంతంలో ఉన్నవారికి జగత్తుయొక్క వాస్తవ స్వభావ, స్వరూప, తాత్త్విక విషయ జ్ఞానం అసంపూర్ణం, కాబట్టి వారు తద్విషయమై అజ్ఞానాన్ని తొలగజేయలేరు. వారికి జంధ్యం అవసరమే!

ఎవరు జగత్తు విషయమైన అజ్ఞానాన్ని పోగొడతారో వారే జగద్గురువులు

ఈ జగద్గురువులు అంటే ఎవరెవరు?

ఒక శరీరాన్ని, ఒక ఆకారంతో ఉన్నవారిని చూసి జగద్గురువులు అని అంటున్నాము. వారు బ్రహ్మాన్ని తెలుసుకుంటే అంటే తార్కికంగా ఐనా, అనుభవపూర్వకంగా ఐనా తెలుసుకున్న వారిని జగద్గురువులంటున్నాము.

ఐతే, మనకు భాగవతం 2వ స్కందం, 5వఅధ్యాయంలో బ్రహ్మ నారద సంవాదంలోని 10-12 శ్లోకాలలో జగద్గురు విషయం ఉన్నది.

నానృతం తవ తచ్చాపి యథా మాం ప్రబ్రవీషి భోః !

అవిజ్ఞాయ పరం మత్త ఏతావత్త్వం యతో హి మే !! 10

యేన స్వరోచిషా విశ్వం రోచితం రోచయామ్యహమ్ !

యథార్కోఽగ్నిర్యథా సోమో యథర్‍క్షగ్రహ తారకాః !! 11

తస్మై నమో భగవతే వాసుదేవాయ ధీమహి !

యన్మాయయా దుర్జయయా మాం బ్రువంతి జగద్గురుమ్!! 12

ఓ నారదా! వాస్తవముగా నన్ను గూర్చి నీవు సర్వజ్ఞుడవు, సర్వేశ్వరుడవు మొదలైన మాటలచే సంబోధించిన విషయం ఏదీ అసత్యం కాదు. ఎందుకంటే? నాకంటే అధికుడైన పరమాత్మ యొక్క తత్త్వమును గూర్చి తెలియనంతవరకూ "ఇదంతా నా ప్రభావమే" అని లోకంలోని వారికి అనిపించడం సహజము. యథార్థముగా ఈ సమస్త సృష్టికీ ఆపరమశక్తి స్వరూపుడగు పరమాత్మ శక్తియే కారణము.(10) నారదా! సూర్యుడు, అగ్ని, చంద్రుడు, నక్షత్రములు, గ్రహములు, తారాకలు, స్వయంప్రకాశమానుడైన ఆ భగవంతుని నుండి తేజస్సును పొందియే, ఈ జగత్తులో వెలుగులు నింపుచున్నవి. అదే విధంగా నేను కూడా ఆ పరమేశ్వరునిచే ప్రకాశింపజేయబడీన జగత్తును మాత్రమే ప్రకటింపజేయుచున్నాను. (11) భగవంతునియొక్క దుర్జయమైన మాయచే మోహితులవడం వలననే లోకులు నన్ను చూచి జగద్గురువుగా పేర్కొనుచున్నారు. వాస్తవముగా ఆ శ్రీ కృష్ణుడే జగద్గురువు (కృష్ణం వందే జగద్గురుమ్) అటువంటి వాసుదేవ భగవానుని నేను నమస్కారపూర్వకముగా ధ్యానించుచున్నాను.(12)

ఈ విషయం ద్వారా మనకు సిద్ధమైనదేమంటే పరబ్రహ్మమునే జగద్గురువు అని చెప్పబడింది. ఆ పరబ్రహ్మమును తెలుసుకున్నవారిని కూడా జగద్గురువు అని సంబోధించబడుతున్నారు.

జగద్గురువులు అంటే ఒక్కరే ఒక్కరు ఆ పరమాత్మయే! అప్పుడు మరి శంకరభగవత్పాదులు జగద్గురువులు కారా! అంటే?

వేదాంత ప్రతిపాదిత అద్వైత సిద్ధాంతం ప్రకారం _ "బ్రహ్మవిద్బ్రహ్మైవ భవతి - బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే ఔతున్నాడు"_

నేనే బ్రహ్మమును అని తెలుసుకోవడం అసలైన తెలుసుకోవడం అదీ అద్వైతం! అంతే తప్ప వేరెక్కడో ఉన్నది బ్రహ్మము అని తెలుసుకోవడం అసలు తెలుసుకోవడం కాదు.

అంటే "This is Bramham" అని కాదు, "I am Brahmam" అని తెలుసుకోవడమే అసలైన తెలుసుకోవడం. ఆ విధమైన జ్ఞానమును తెలుసుకున్నవారూ బ్రహ్మమే, వారే జగద్గురువులుగా పిలువబడుతున్నారు.

ఐతే మరి ఎంతమంది జగద్గురువులు? అనాదిగా సదాశివుడు, నారాయణుడి నుంచి లెక్కకడితే ఇప్పటివరకూ ఎందరో జగద్గురువులు. వేలు లక్షలు. ఔనా ? కానీ ఈ లెక్క శరీరాలను , నామరూపాలను సూచించే లెక్కయే కదా! వీళ్ళు జగద్గురువులు, వాళ్ళు జగద్గురువులు ఎందరో జగద్గురువులు అని చెప్పేవారు శరీరాలను లెక్కపెడుతున్నారు తప్ప, బ్రహ్మమును చెప్పట్లేదు. బ్రహ్మము ఒక్కటే, అదే జగద్గురు తత్త్వం.

ఏ వ్యక్తి ఆ బ్రహ్మము తానే అనీ, ఈ జగత్తు అవాస్తవమనీ దాని తత్త్వ స్వరూపాది విషయకాన్ని తెలుసుకుని బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే వేదాంత వాక్యాన్ని అనుభవపూర్వకముగా తెలుసుకున్నాడో అతనే జగద్గురువు.

ఒకసారి కంచికామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేన్ద్ర సరస్వతీ మహాస్వామి వారు చిన్నవయసులోనే ఉన్నప్పుడు ఉత్తరభారత యాత్ర చేశారు. ప్రయాగలో చాతుర్మాస్యం చేసి కాశీవైపు యాత్ర ప్రారంభించారు. కాశీలో పండితులు ప్రముఖులు రెండుగా విడిపోయారు, వారి ప్రకారం నాలుగు ఆమ్నాయ పీఠాల్లో కంచిపీఠంలేదు కాబట్టి ఆహ్వానం, గౌరవ సత్కారం అవసరంలేదు అని కొందరభిప్రాయం. అప్పుడు కాశీరాజు సంకటంలో పడిపోయారు. ఏంచేయాలో తెలియలేదు, వచ్చినది సామాన్య యతి కాదు, పైగా కంచి కామకోటి పీఠాధీశ్వరులు. అప్పుడు కాశీరాజు ప్రయాగనుంచి వస్తూ వింధ్యాచలంలో బస చేసిన పరమాచార్య స్వామి వారి వద్దకు సాదరంగా వెళ్ళి, మేముండేది వ్యాసకాశీలో, కాబట్టి ఉత్తరకాశీపండితుల విషయం పక్కనపెట్టి, పీఠంతో , పరివారంతో సహా వచ్చి మా ఆతిథ్యం స్వీకరించమని విజ్ఞప్తి చేసారు. అపుడు స్వామివారు ఉత్తరకాశీ పండితులు వచ్చి మమ్మల్ని జగద్గురువులు అని నిర్ణయిస్తే మేము కాశీ వస్తాము. లేదా విశ్వేశ్వరునికి ఇక్కణ్ణుంచే నమస్కారం చేసి వెళ్ళిపోతాము అని తెలిపారు. అప్పుడు ఉత్తరకాశీ నుంచి వచ్చిన పండిత బృందం స్వామివారిని " మీరు జగద్గురువులు ఎలా ఔతారు, మీకు జగత్తంతా తెలుసా?" అని ప్రశ్న వేసారు. అప్పుడు స్వామి వారు ఎవరు జగద్గురువో వారు జగత్తునుండి అన్నీ తెలుసుకుంటారు. అని భాగవతంలోని అనేక ఘట్టాలను, దత్తాత్రేయ స్వామి వారు జగత్తులోని అనేక విషయాల ద్వారా వారు నేర్చుకున్నవిషయాలను చూపారు.

మన ఇంట్లో చెత్త ఊడ్చి బైట పారేస్తే (పూర్వకాలంలో, ఇప్పటికీ పల్లెల్లో) కోడి వెళ్ళి చెత్తను తనకాళ్లతొ లాగేసి, తనక్కావలసిన గింజలో, ఏ ఆహారమో మాత్రమే ముక్కుతో పొడిచి తింటుంది. మన ఉంగరంలోంచి వజ్రం ముక్క పడిపోయి అది చెత్తతో పాటు బైట పారవేయబడ్డా, చెత్తలో ఆహారం ఏరుకునే కోడి మాత్రం దాన్ని వజ్రం ముక్క చాలావిలువైనది అని దాచదు, మిగిలిన చెత్తతో సమానంగానే కాళ్లతో జరిపేసి తనకి కావలసినది మాత్రమే ముక్కుతో తీసుకుంటుంది. ఇలా జగత్తునుంచి తెలుసుకొనే విషయాలనేకం.

ఆతరవాత ఎంతో సంతోషంతో ఉత్తరకాశీ పండితులంతా కలిసి జగద్గురువు అని నిర్ణయించి వారిని సాదరంగా కాశీకి ఆహ్వానించి, స్వాగత సత్కారాలు ఉత్సవాలు చెసారు.

జగత్తులో ఉన్న తాత్విక విషయం తెలుసుకొని, జగద్విషయకమైన అజ్ఞానము, అంధకారాన్ని పోగొట్టేటువంటి వారే జగద్గురువులు.

ఇంతమంది జగద్గురువుల శరీరాలు వేరైనా, లెక్కపెట్టగలిగినా పరమాత్మ తత్త్వం ఒక్కటే జగద్గురుత్వం, జగద్గురుతత్త్వం ఒక్కటే!

మన ఇంట్లో కిచెన్, హాలు, బెడ్రూమ్, పూజారూమ్, స్టోర్ రూమ్ అన్నీ ఉన్నాయ్ అన్నిరూములూ వేరే ఆయా గదులకోసం కట్టిన గోడలవల్ల ఆయా గదుల్లో ఉండే స్పేస్/ఆకాశం వేరుగా కనపడుతోంది. అదే పూజారూమ్ చిన్నగా ఉన్నదని గోడ బద్దలుకొట్టి స్టోర్ రూమ్ పూజారూం కలిపేస్తే ఇప్పుడున్నది ఒకటే గది, ఒకటే ఆకాశం. "ఆకాశవత్ సర్వగతశ్చ నిత్యః" గమనిస్తే గురు తత్త్వం ఒక్కటే, కానీ గురువు శరీరాన్నిచూసి ఆ శరీరమే గురువు అని అనుకోవడం కాదు, గురువు అనేది ఒక తత్త్వం. తత్త్వానికి ఆకారం లేదు, ఉండదు. అందుకొరకు ఆకారానికి, ఆ శరీరానికి పూజ, గౌరవం. గురువు ఆకాశం వలె సర్వ వ్యాపకుడు అతనికి శరీరం ఒక ప్రతీక.

ఏ విషయమైన అజ్ఞాన్ని పోగొడితే ఆవిషయానికి గురువు అని అన్నట్లు, రామాయణం చెప్ఫేవారిని రామాయణ గురువు, భాగవతం చెప్పేవారిని భాగవత గురువు, పురాణం చెప్పేవారిని పురాణ గురువు అని అంటున్నాం. దానర్థం వాళ్ళు రామాయణానికంతటికీ గురువు , లేదా భాగవతానికంతటికీ గురువు, లేదా పురాణాలన్నిటికీ గురువు అని కాదు. రామాయణానికి సంబంధించిన అజ్ఞానాన్ని, భాగవతానికి సంబంధించిన అజ్ఞానాన్ని, పురాణాలకు సంబంధించిన అజ్ఞానాన్ని తొలగతేసే గురువులు అని అర్థం.

అదే విధంగా ఈ జగత్తు విషయకమైన అంధకారాన్ని, అజ్ఞానాన్ని పోగొట్టి దాని స్వభావాన్ని బోధించి సత్యం తెలియజేసే గురువే "జగద్గురువు". జగత్తు యొక్క అసలు స్వరూపాన్ని యెరిగి, తానే బ్రహ్మమైయున్నాననే సత్యాన్ని తెలుసుకున్న అటువంటి గురువులందరకూ ప్రతీకగా శంకరులు ఆయా పీఠాల్లో పీఠాధిపతులను జగద్గురువులుగా ప్రతిష్ఠించే వ్యవస్థను ఏర్పరచారు.

Saturday, October 20, 2018

శ్రీమన్నారాయణ నామస్మరణ మహాత్యం

ఒకసారి నారద మహర్షి కి ఓ అనుమానము వచ్చింది


నారాయణ నామస్మరణ వలన ప్రయోజనము ఏమిటాని? వెంటనే మహర్షి వైకుంఠము వెళ్ళి తన అనుమానమును శ్రీమన్నారాయణుని ముందుంచాడు. భగవంతుడు నారదమహర్షితో ఇలా అన్నాడు. “నారదా! ఇప్పుడే భూలోకంలో నైమిశారణ్యంలో ఒక కీటకం జననమెత్తింది. దానిని వెళ్ళి అడుగు” అని ఆకీటకాన్ని చూపించాడు. భగవంతుని ఆనతి మేరకు నారదుడు ఆకీటకము దగ్గరకు వెళ్ళి నారాయణ నామస్మరణ వలన ప్రయోజనము ఏమిటని ప్రశ్నించాడు. వెంటనే ఆకీటకము గిలగిలకొట్టుకుని చనిపోతుంది. విచారంగా నారదమహర్షి వైకుంఠము తిరిగి వెళ్ళి జరిగిన విషయము శ్రీమన్నారాయణునికి విన్నవించాడు. “ఒహో! అలాగా!! అయితే మళ్ళీ భూలోకం వెళ్ళి, కశ్యపుని ఆశ్రమములోనున్న కపిలగోవుకి జన్మించిన వత్సము(ఆవుదూడ)ను అడుగు” అని ఆనతిస్తాడు. నారద మహర్షి కశ్యపుని ఆశ్రమములోనున్నఆవుదూడ వద్దకు వెళ్ళి అదే ప్రశ్న వేస్తాడు. ఆ ప్రశ్నవినగానే ఆ ఆవుదూడకూడ గిలగిల తన్నుకుని చనిపోతుంది.నారదమహర్షి ఆశ్చర్యచకితుడయ్యి, విషయాన్ని శ్రీమన్నారాయణునికి తెలియపరుస్తాడు.శ్రీమన్నారాయణుడు “నారదా! ఇప్పుడే కాశీరాజుకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ శిశువుని వెళ్ళి నీ ప్రశ్న వెయ్యి” అని చెపుతాడు. అప్పుడు నారదమహర్షి ” ప్రభూ, నావలన ఒకకీటకము ఆవుదూడ చనిపోయినవి. ఇప్పుడు శిశుహత్యాపాతకముకూడా నామెడకు చుట్టుకునేలావుంది.” అని శ్రీమన్నారాయణునితో వాపోతాడు. దానికి శ్రీమన్నారాయణుడు, “నారదా! నీకు ఏహత్యాపాతకము తగలదు. ఆశిశువు వద్దకు వెళ్ళి నీఅనుమానము నివృత్తిచేసుకో” అని అభయమిస్తాడు. శ్రీమన్నారాయణుని ఆజ్ఞమేరకు నారదమహర్షి ఆ కాశీరాజుకు జన్మించిన శిశువు దగ్గరకు వెళ్ళి తన సందేహము తీర్చమని అడుగుతాడు. అప్పుడాశిశువు పకపకానవ్వి “ఓ మహర్షి నేను అనేక జన్మలలో చేసిన పాపాల ఫలితముగా నీచమైన కీటకజన్మ ఎత్తవలసివచ్చింది. ఆజన్మలో నీవు వచ్చి “నారాయణ” అనే నామము నాచెవిలో పడవేసావు. ఆ అతిపవిత్రమైన నామము నాచెవిన పడగానే నాజన్మజన్మల పాపము నశించి పవిత్రమైన గోజన్మ వచ్చింది. ఆ జన్మలో కూడా నీవు వచ్చి మరల ఆ అతిపవిత్రమైన నామము నాకు వినిపించావు. తక్ష్ణమే ఆ పుణ్యఫలము అనుభవించనిమిత్తము ఈ కాశీరాజుకు కుమారునిగా జన్మించాను. ఇంతకన్నా నారాయణ నామస్మరణ మహాత్యము ఏమని చెప్పమంటావు! ఓ మహర్షి !” అని ఆ శిశువు మరల తన నరజన్మ అనుభవములోనికి వెళ్ళిపోతుంది.
నారదమహర్షి పరమానందభరితుడై శ్రీమన్నారాయణుని అనేకానేకములుగా స్తుతించి తన ఆశ్రమమునకు తిరిగి వెడతాడు.

భారతీయ శ్లోకాల్లో సైన్స్… ఆశ్చర్యపరిచే నిజాలు

భారతీయుల ఙ్ఞానసంపద ఒక మహా సముద్రం… అందులో మన ఋషులు, మునులు, ఆచార్యులు, గురువులు, పెద్దలు రచించిన శ్లోకాలు నీటి బిందువులు వంటివి. అందులో ఒకటంటే ఒక నీటి బిందువు చాలు… భారత దేశం “విశ్వగురువు” అని సగర్వంగా చెప్పడానికి.
హనుమాన్ చాలీసాలో ఒక శ్లోకం
తులసీదాస విరచిత హనుమాన్ చాలీసాలో ఒక శ్లోకం గురించి మాటాడుకుందాం…
“యుగ సహస్ర యోజన పర భానూ!
లీల్యోతాహి మధుర ఫల జానూ”!!
దీని తాత్పర్యం సవివరముగా తెలుసుకుందాం…
యుగ= 12,000 దివ్య సంవత్సరములు
సహస్ర=1000
యోజన్= 8 మైళ్ళు
యుగ x సహస్ర x యోజన= పర్ భాను
12000 x 1000 x 8 మైళ్ళు=96000000 మైళ్ళు
1 మైళు = 1.6 కిలో మీటర్లు
96000000 మైళ్ళు = 96000000 x 1.6 కిలో మీటర్లు =
153600000 కిలో మీటర్లు (ఇది భూమికి సూర్యునికి మధ్య దూరంగా కవి వర్ణన)
ఈ విషయాన్ని నాసావాళ్లు స్వయంగా ఒప్పుకోవడం కూడా జరిగింది. కాకపోతే నాసా(NASA) శాస్త్రఙ్ఞులు భూమికి సూర్యునికి మధ్య దూరాన్ని ఇంత ఖచ్చితంగా చెప్పలేదు.
According to Modren Astronomy and Science , we know that the earth’s orbit around the sun is not a circle and is slightly elliptical. Therefore, the distancebetween the earth and the sun varies throughout the year.
At its nearest point on the ellipse that is the earth’s orbit around the sun, the earth is 91,445,000 miles (147,166,462 kms) from the sun. This point in the earth’s orbit is known as Periapsis (perihelion) and it occurs around January 3.
The earth is farthest away from the sun around July 3 when it is 94,555,000 miles (152,171,522 km) from the sun. This point in the earth’s orbit is called Apoapsis (aphelion). The average distance from the earth to the sun is 92,955,807 miles (149,597,870.691 km).
హనుమంతుడు భువి నుండి సూర్యుణ్ణి చూసి దానిని ఒక తినే పండుగా భావించి సూర్య మండలానికి చేరుకున్నాడని మన ఇతిహాసాలు తెలిపిన విషయాలలో వాస్తవికతను గ్రహించిన విదేశీయులు ఆశ్చర్యచకితులవుతున్నారు.
వేల సంవత్సరాల క్రితమే మనకున్న విఙ్ఞానం అలాంటిది…!
ఇదీ మన భారత వైశిష్ట్యం…
ఇదీ మన వేద విఙ్ఞాన సారం…
ప్రతి భారతీయుడికి గర్వకారణం…
మన ఈ విఙ్ఞానాన్ని ప్రపంచానికి చాటుదాం…!

"పుణ్యం...అనగా"...

కాశీ పరమ పవిత్రమైన శైవ క్షేత్రం. కాశీ విశ్వేశ్వరుణ్ని దర్శిస్తే పాపాలన్నీ‌ నశిస్తాయని, ఇక పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. అందుకని లక్షల సంఖ్యలో భక్తులు ప్రతిరోజూ విశ్వేశ్వరుడిని దర్శించుకొని వెళ్తుంటారు.
ఒక శివరాత్రి పండుగ రోజున అలా శివుడిని దర్శించుకునేందుకు బారులు తీరిన జనాల్ని చూసి, పార్వతి శివుడితో "స్వామీ! కాశీకి వెళ్ళిన వాళ్ళంతా కైలాసానికి వస్తారంటారే, మరి ఇంత మంది కైలాసానికి వచ్చేస్తే ఇక మనం ఉండేందుకు అక్కడ చోటు మిగలదేమో, ఎలాగ?" అన్నది.
శివుడు నవ్వి, "ఇంతమంది కైలాసానికి రావటం ఎలా సాధ్యం దేవీ? వీళ్ళలో ఒకళ్లిద్దరు ఉంటారేమో, కైలాసవాసానికి అర్హత ఉన్నవాళ్ళు!" అన్నాడు.
"ఎలాంటి వాళ్ళు?" అడిగింది పార్వతి.
"చూద్దాం, రా!" అని శివుడు పార్వతిని వెంట బెట్టుకొని బయలుదేరాడు.

శివపార్వతులు ఇద్దరూ ముసలివాళ్ళుగా మారారు. శివుడు తొంభై ఏళ్ళ ముసలివాడైనాడు. పార్వతి ఎనభై ఏళ్ళ ముసలమ్మ వేషం ధరించింది. ఇద్దరూ కాశీ విశ్వేశ్వరాలయ సింహద్వారం చేరారు. అక్కడ ముసలమ్మ తన భర్త తలను ఒళ్ళో పెట్టుకొని కూర్చున్నది. దేవాలయంలోకి వెళ్ళే వాళ్లందరినీ "అయ్యా, భక్తులెవరైనా దయ తలచండి! నా భర్త దాహం తీరేందుకు కొంచెం గంగా జలం పోయండి! నేను వెళ్ళి గంగా జలం తీసుకు రావటం సాధ్యం కాదు. నా భర్త ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు- ఏ క్షణంలోనైనా ప్రాణం పోవచ్చు. ఈ స్థితిలో నేను ఆయన్ని విడిచి వెళ్ళలేను. మీరెవరైనా కొంచెం సాయం చేయండి" అని వేడుకుంటున్నది.

గుడిలోకి వెళ్ళే భక్తులంతా అప్పటికే గంగానదిలో స్నానం చేసి, తడి బట్టలతో, చేతిలో ఉన్న పాత్రల్లో గంగా జలం నింపుకొని వస్తున్నారు. ఆ గంగ నీటితో విశ్వేశ్వరుణ్ని అభిషేకిస్తారు వాళ్ళు. "ఇదేమిటి, విశ్వేశ్వరుని దర్శనానికి వస్తే ఈ దరిద్ర దేవత ఎదురైంది?" అని కొందరు ముసలమ్మను తప్పించుకొని వెళ్ళారు. మరికొందరు "ఉండమ్మా, మేం ఇంకా దేవుడిని దర్శించుకోనే లేదు; అభిషేకం అయిన తర్వాత వచ్చి నీ భర్త సంగతి చూస్తాము" అని చెబుతూ లోనికి వెళ్లిపోయారు.
ఆ సమయంలో ఒక దొంగ వచ్చాడు అక్కడికి. "దేవాలయ సింహద్వారం దగ్గర‌ భక్తులు క్రిక్కిరిసి ఉన్నారు. 'జేబులు కొట్టవచ్చు; అలాగే ఆడవారి మెడలలోని నగలు అపహరించవచ్చు" అని వచ్చాడు ఆ దొంగ. అందరినీ అడిగినట్లే ముసలమ్మ ఆ దొంగను కూడా అడిగింది-"అయ్యా! మేం విశ్వేశ్వరుడిని దర్శించేందుకు వచ్చాం. కానీ వయసు పైబడిన నా భర్త అలసిపోయి, ఇక్కడే కూలబడ్డాడు. ఎవరైనా పుణ్య ప్రభువులు, ఇంత గంగా జలం తెచ్చి ఆయ నోట్లో పోస్తే సేదతీరుతాడేమో. అందరినీ అడుగుతున్నాను నాయనా, నువ్వైనా దయచూడు" అని. 

దొంగ చేతిలో ఒక సొరకాయ బుర్రనిండా గంగ నీళ్ళు ఉన్నాయి. అతను "దానిదేముంది అవ్వా, ఇప్పుడే తెచ్చుకున్నాను గంగ నీళ్ళు- ఇవిగో!" అని ఆ నీళ్ళను ముసలాయన నోట్లో పోసేందుకని మోకాళ్ళపైన కూర్చున్నాడు.

అవ్వ అన్నది- "కాస్త ఆగు నాయనా! ఆయన నోట్లో నీళ్ళు పోసేముందు, నువ్వు చేసిన పుణ్యకార్యాల్లో ఏదో ఒకటి చెప్పి, ఆ పైన నీళ్ళు పొయ్యి బాబూ! నీ పుణ్యంవల్లనైనా ముసలాయన మంచి లోకాలకు పోతాడు" అని.
దొంగకు ఏం చేయాలో తోచలేదు. గుర్తు ఎరిగిన నాటి నుండీ 'తను చేసిన మంచి పని' అంటూ ఒక్కటీ లేదు! ఇలా తన పుణ్యాన్ని లెక్కించుకునే అవసరమూ ఏనాడూ ఎదురవ్వలేదు! అతను సిగ్గు పడుతూ అన్నాడు ముసలమ్మతో- "అమ్మా, నేనొక దొంగను. ఇంతవరకూ నేను ఒక్క పుణ్యకార్యం కూడా చేయలేదు. ఇదిగో, ఇప్పుడు, ఈయన నోట్లో గంగాజలం పోద్దామనుకున్నానే, ఇదొక్కటే కావొచ్చు, నేను చేస్తున్న మంచి పని" అని చెప్పి, ముసలాయన నోటిలో నీరు పోశాడు అతను.
మరుక్షణం శివ పార్వతులు ఆ దొంగకు నిజరూపాలతో దర్శనం ఇచ్చారు: "నాయనా, నిజం చెప్పటం ద్వారా నువ్వు ఈనాడు గొప్ప పుణ్యం సంపాదించుకున్నావు. సత్యాన్ని మించిన ధర్మం లేదు. నువ్వు చేసిన ఈ ఒక్క మంచి పని వల్ల, ఇంతకాలంగా చేసిన పాపాలన్నీ‌ పటాపంచలయ్యాయి. ఇకపైన చెడు పనులు చేయకు. పవిత్రంగా బ్రతుకు. మానవ సేవే పరమార్థంగా భావించిన నువ్వు, జన్మాంతంలో‌ కైలాసానికి చేరుకుంటావు" అని, వాళ్లు అంతర్థానమయ్యారు. ఆపైన దొంగ పూర్తిగా మారిపోయాడు. జీవితాంతం మంచిపనులు చేస్తూ గడిపాడు.

"చూశావా! ఇలాంటి ఏ కొందరో వస్తారు, కైలాసానికి. పరోపకారాన్ని మించిన ప్రార్థన లేదు" అన్నాడు శివుడు, పార్వతితో. "అవును" అన్నది పార్వతి, అంగీకరిస్తూ...

💐ఓం నమః శివాయ💐

ప్రకృతి అందించిన గురువులు

🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
సద్గురువులు కావాలని ఈరోజుల్లో ఎందరో ఎదురుచూస్తున్నారుకాని మనం పుట్టిన నాటి నుండి చనిపోయే వరకు నిత్యం క్షణకాలం పాటు మనల్ని విడువకుండా ఉండే గురువులును ఎందుకు గుర్తించలేకపోతున్నారు?
ప్రకృతి ఇచ్చిన గురువులు: నేల, నింగి, గాలి, నీరు, నిప్పు, పంచభూతాలు. ప్రకృతి లో ఉన్న ఈ పంచభూతాలతో నిర్మితమైనదే మానవదేహం.
నేల : ఎందరు ఎన్నిరకాలుగా వాడుకున్నా సహిస్తుంది. నేలకు సహనం సహజగుణం. పుట్టిన దగ్గర నుండి నిన్ను మోసి, చివరికి తనలో కలుపుకుంటుంది. ఇలాంటి నేలను చూసి మీరు ఏమి నేర్చుకున్నారు?
నీరు : ఎన్ని మలినాలు చేసినా సహజంగా శుద్ధి చేసుకుంటుంది. అలానే కాక శుబ్రం చేసే గుణం కలిగి ఉంది. మనషి ఎల్లప్పుడూ శుచిగా ఉండాలనే జ్ఞానాన్ని సూచిస్తుంది. దీనిని చూసి ఏమి నేర్చుకున్నావు?
నిప్పు : మలినాలను పోగొడుతుంది. దేవతలకు మనం చేసే యజ్ఞంయాగాది క్రతువుల నుండి ఆహారాన్ని అందిస్తుంది. లోకాలకే వెలుగులు ప్రసాదిస్తుంది. నిప్పులో నిర్మలత్వం ఉంది. దీని వలన ఏమి నేర్చుకున్నావు?
గాలి : ఎప్పుడూ నిరాపేక్షంగా ఉపకారం చేస్తుంది. పువ్వులలో ఉండే పుప్పొడిని తీసుకెళ్ళి పరపరాగ సంపర్కం గావించి వృక్ష సంపదను వృద్ది పొందిస్తుంది. మనిషికి నిరంతరం చెట్లనుండి ఆక్సిజన్ అందిస్తుంది. ఇలా గాలిని పరోపకార బుద్ది నేర్పుతుంది. దేనిలో ఉన్న పరోపకార బుద్దిని అలవరచుకున్నారా?
ఆకాశం : ఎన్ని కారుమబ్బులు కమ్ముకున్నా ఆకాశం ఎప్పటికీ నిర్మలంగానే ఉంటుంది. మనిషి జీవితం మాయ ప్రపంచం చుట్టూ తిరుగుతూ మనస్సుకు అనేక మాయలు కల్పిస్తుంది. ఈ మాయల మబ్బుల నుండి వివడటానికి నిర్మలత్వాన్ని చూపిస్తున్న ఆకాశం నుండి ఏమి తెల్సుకున్నారు?
తుమ్మెద పువ్వులలో ఉన్న తేనెను మాత్రమే ఆస్వాదిస్తుంది. మనిషికూడా విషయంలో ఉన్న సారాన్ని మాత్రమే గ్రహించాలి. కాని మనిషి మాత్రం విషయాన్నే వక్రీకరణ బుద్దితో ఆలోచిస్తున్నాడు.
చేపను చూసి జిహ్వ చాపల్యం చంపుకోవాలి. ఎరను చూసి పట్టుకోవాలని ప్రయత్నించి చివరికి చనిపోతుంది. మనిషి కోరికల ఎరకు చిక్కి ఆయుష్షుని తగ్గించేసుకున్తున్నాడు.
చివరికి అమ్మాయి చేతికి ఉన్న గాజు కూడా గురువే. ఒక్కగాజు నిశబ్దంగా ఉంటే నాలుగు గాజులు గోలచేస్తాయి. ఒంటితనం తోనే మనిషి ఏదైనా సాధించడానికి అవకాశం కలిగిస్తుంది. నలుగురిలో ఉంటే విషయం మీద ధ్యాస తగ్గిపోతుంది.
ఇలా ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కటీ మనకు అనేకరకాలుగా భోదిస్తుంటే మనం మాత్రం పట్టించుకోవడం లేదు. మరి గురువులు చెప్పే విషయాలు వింటారా?

హిందు అనే పదం మన ధర్మానికి ఎలా వచ్చింది?

చాలా మందికి హిందు అనే పదం మన ధర్మానికి ఎలా వచ్చింది అనేది తెలియని వారు చాలమంది ఉన్నారు.. క్రైస్తవులు ఇది ఎదో జికే క్వశ్చన్ ల మన హిందువులను అడుగుతుంటారు అలాంటివ్వారందరి కోసం ఈ పోస్టు.....
హిందూ ధర్మం (Hinduism orHindu Dharma) భారతదేశంలో జన్మించిన ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం. హిందూ మతం అతి పురాతన మతం. దీనినే 'సనాతన ధర్మం' అని కూడా తరచు వ్యవహరించడం జరుగుతుంది. పూర్వకాలమునందు భారతదేశమున ఏది ధర్మనామముతో వ్యవహరింపబడినదో, అదియే ఇపుడుమత మను పేరుతో వాడబడుచున్నది.ధర్మము అనగా ఆచరణీయ కార్యము.మత మనగా అభిప్రాయము . హిందూ అనే పదమును ఫార్సీలు మొదట వాడేవారు, హిందు అనే పదానికి ఫార్సీ భాషలో సింధు అని అర్థము,#సింధూనది ఒడ్డున నివసించే వారిని అలా పిలచేవారు కాని ఇప్పుడు వేదాలు మరియు వాటికి సంబంధించిన మతాలను ఆచరించే వారినే హిందువు అని పిలుస్తున్నారు. హిందూమతం మరియు దాని మూలాలు వేదకాలపు నాగరికతకు సంబంధించినవి.ప్రపంచంలోనే అన్నింటికన్నా ప్రాచీనమైనది. వివిధ రకాలైన భిన్న విశ్వాసాల కలయికయైన #హిందూధర్మాన్ని ఏ ఒక్కరో కనుగొన్నట్టు ఆధారాలు లేవు.

ఇస్లాం, మరియు క్రైస్తవం, తరువాత ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద మతం. సుమారు ఒక బిలియన్ హిందూ జనాభాలో 905 మిలియన్లు భారతదేశం మరియు నేపాల్ లోనే నివసిస్తున్నారు. ఇంకా హిందువులు ప్రధానంగా ఉన్న దేశాల్లో బంగ్లాదేశ్,శ్రీలంక, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్,_మారిషస్, ఫిజి, సూరినాం, గయానా, ట్రినిడాడ్మరియు టుబాగో, అమెరికా, రష్యా మరియు చైనాముఖ్యమైనవి
హిందువుల వేద సంపద చాలా అమూల్యమైనది. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి వస్తున్న వేదాలను చెప్పబడిన వాటిగా, గుర్తుంచుకోబడిన వాటిగా విభజించవచ్చు. ఈ వేదాలు వేదాంత శాస్త్రం, తత్వ శాస్త్రం, పురాణాలు,మరియు ధర్మాన్ని ఆచరించడానికి కావలసిన లోతైన జ్ఞానాన్ని విశదీకరిస్తాయి. సాంప్రదాయం ప్రకారం వేదాలు మరియు ఉపనిషత్తులుఅతి పురాతనమైనవి, ముఖ్యమైనవి, ప్రామాణికమైనవి. ఇంకా తంత్రాలు, ఆగమాలు,పురాణాలు మరియు మహా కావ్యాలైనటువంటిరామాయణం, మహాభారతం కూడా ముఖ్యమైనవే. కొన్నిసార్లు భగవద్గీత అన్ని వేదముల సారాంశముగా భావించబడుతోంది.
క్రొత్త రాతియుగం నుండి హరప్పా మొహంజొదారో నాగరికత కాలం వరకు హిందూమతం గురించిన పురాతన ఆధారాలు ఉన్నాయి.(5500–2600BCE)(1500–500BCE) కాలానికి చెందిన అంశాలను 'చారిత్రిక వైదిక ధర్మం'కు చెందినవని అంటారు.
వేదాల ఆవిర్భావం నుండి హిందూమతం ఆచారాలు, సిద్ధాంతాలలో ఏర్పడిన స్పష్టత ఇప్పటికీ కొనసాగుతున్నది. వీటిలో అతి పురాతనమైన [[ఋగ్వేదం]] 1700–1100 BCE కాలానికి చెందినదని ఒక అభిప్రాయం. వేదాలలో ఇంద్రుడు, వరుణుడు,అగ్ని వంటి దేవతల ఆరాధన, సోమయాగం వంటి యజ్ఞకర్మలు బహుళంగా చెప్పబడ్డాయి. విగ్రహారాధన కంటే మంత్రారాధన, యజ్ఞకాండలు వేదసాహిత్యంలో ప్రాముఖ్యత వహిస్తాయి. ఋగ్వేదంలోని ఆచారాలు, విశ్వాసాలు [[జొరాస్ట్రియన్ మతము|జొరాస్ట్రియన్ మతాని]]కి కొంత సారూప్యం కలిగి ఉన్నాయి.
వేదాల తరువాతి కాలాన్ని పురాణాల కాలంగాపేర్కొంటారు. వీటిలో మొదటివైనరామాయణం,మహాభారతం 500–100BCE, కాలంలో రూపుదిద్దుకొన్నాయి. తరువాత అనేక పురాణాలు వెలువడ్డాయి. పురాణాలలోని వివిధ అంశాలు నేటి హిందూమతాచారాలు, వ్యవహారాలు, విశ్వాసాలకు ప్రధాన ప్రమాణాలు.
హిందూ మతాన్నీ, అందులోని నమ్మకాలనూ మౌలికంగా ప్రభావితం చేసి, క్రొత్త పరిణామాలకు దారితీసిన మూడు ముఖ్యాంశాలు - ఉపనిషత్తులు,జైన మతము, బౌద్ధ మతము వీటిలో వేదాల సాధికారతను, వర్ణ వ్యవస్థ బంధాన్ని అంగీకరించకుండా మోక్షము లేదా నిర్వాణం పొందడం గురించి చెప్పబడింది.[ఆధారం చూపాలి]. గౌతమ బుద్ధుడుమరింత ముందుకు వెళ్ళి ఆత్మ లేదా భగవంతుడు అన్న నమ్మకాలను ప్రశ్నించాడు. మౌర్యుల కాలంలో బౌద్ధం దేశమంతటా వర్ధిల్లింది (క్రీ.పూ 300 నుండి క్రీ.శ. 200 వరకు). తరువాత వివిధ వేదాంత దర్శనాలుఅనేక విధాల సిద్ధాంతాలను ప్రతిపాదించాయి. వీటిలో క్రీ.పూ. 6వ శతాబ్దం నాటి చార్వాకుని నాస్తిక వాదం కూడా ఒకటి. క్రమంగా మళ్ళీ బౌద్ధమతాన్ని అణగద్రొక్కి హిందూమతం క్రీ.పూ. 400 నుండి క్రీ.శ. 1000 కాలంలో బలపడింది.
క్రీ.శ. 7వ శతాబ్దంలో భారతదేశంలో అరబ్బు వర్తకుల ద్వారా ప్రవేశపెట్టబడిన ఇస్లాం మతం తరువాత ముస్లిం పాలనా సమయంలో దేశమంతటా విస్తరించింది. ఈ కాలంలో రెండు మతాల మధ్యా వివిధ స్థాయిలలో ఘర్షణలు చోటు చేసుకొన్నాయి. అదే సమయంలో సహ జీవన విధానాలు కూడా అభివృద్ధి చెందాయి. తరువాతి కాలంలో రామానుజాచార్యులు,మధ్వాచార్యులు, చైతన్యుడు వంటి ప్రవక్తల బోధనల వల్ల హిందూమతంలో మరికొన్ని నూతన విధానాలు నెలకొన్నాయి.